వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కి: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) జన్‌ధన్ ఖాతాల విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన రూ. 16 కోట్లకుపైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది.

9లక్షల మంది ఖాతాల్లోకి నగదు..

9లక్షల మంది ఖాతాల్లోకి నగదు..

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాల్లో నెలకు రూ. 500 చొప్పున మూడు నెలలపాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర చెప్పినట్లుగానే నగదును జన్‌ధన్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9 లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెలకు చెందిన రూ. 500 చొప్పున జమ అయ్యాయి.

16 కోట్ల నగదు వెనక్కి...

16 కోట్ల నగదు వెనక్కి...

అయితే, వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా గుర్తించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఈ క్రమంలోనే ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ. 16 కోట్లకుపైగా నగదును వెనక్కి తీసుకుంది. ఈ మేరకు వివరాలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ వెల్లడించారు.

పొరపాటు వల్లే..

పొరపాటు వల్లే..


ఆగస్టు 1, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు జీఎం తెలిపారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదు అనర్హులకు జమ చేయడం జరిగిందని, వారం రోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం మహేశ్ తెలిపారు.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !
తీసుకున్న నగదు కూడా రాబడతాం..

తీసుకున్న నగదు కూడా రాబడతాం..

అయితే, అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని, వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జీఎం తెలిపారు. వారు ఖాతాల్లో జమ చేసిన తర్వాత తిరిగి తీసుకుంటామని జీఎం మహేశ్ చెప్పారు. కాగా, కేంద్రం జమ చేస్తున్న రూ. 500 జన్‌ధన్ ఖాతారులు ఎప్పుడైనా తీసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
cash taken back: Telangana Grameena bank on Jan Dhan Accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X