చంద్రబాబుపై ఆధారాలున్నాయి, ముందుకేనని కెసిఆర్?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వదలకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పట్టుబట్టి ఉన్నట్లు తెలుస్తోంది. కథ చాలా పెద్గగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం, బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడడం గమనిస్తే ఆయన కేసులో చంద్రబాబుపై ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన అదే విషయం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత రాజకీయ అంశాల ప్రస్తావన వచ్చింది. ఓటుకు నోటు కేసు, అందులో చంద్రబాబు, టీడీపీకి చెందిన ఇతర నేతల పాత్ర, చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అక్కడ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం, ఇక్కడి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగా తనను కించపరచడం వంటి చంద్రబాబు చర్యల పట్ల కెసిఆర్ మండిపడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని నిరూపించటానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఆయనను వదిలిపెట్టే సమస్యనే లేదని అన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మరికొందరు నేతల పాత్రపైనా ఆధారాలున్నట్లు తెలిపారు.
నోటుకు ఓటు వ్యవహారంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే, కేంద్ర ప్రతిష్టనే దెబ్బతింటుందని అన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం చంద్రబాబుకు అండగా నిలిస్తే, తెలంగాణ ప్రభుత్వం తరఫున ధైర్యంగా ఎదుర్కొందామని మంత్రులకు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న వాదనలను సమర్థంగా తిప్పికొట్టే శక్తి, నిజాలతో కూడిన తగిన సమాచారం తమకు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై పక్కాగా ఆధారాలున్న మేరకు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే, అప్పుడు కేంద్రం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోక తప్పదని అన్నారు. అయితే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ కేసుపై మంత్రులు కొంత సంయమనం పాటించాలని సూచించారు.
చంద్రబాబుపై, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నదనే సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన మంత్రులకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నారనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. నోటుకు ఓటు వ్యవహారంలో ఢిల్లీ నుంచి తనను ఇప్పటి వరకు ఎవరూ సంప్రదించలేదని, వారు అడిగితే అన్ని ఆధారాలు సమర్పించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications