వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాసినో గుట్టు రట్టు- ప్రవీణ్ చిట్టాలో సినీ సెలబ్రటీలు : మాజీ మంత్రులు - ఎమ్మెల్యేలు..!!

|
Google Oneindia TeluguNews

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలంటూ ప్రవీణ్ తో పాటుగా మాధవరెడ్డికి సూచించింది. ఒకే సమయంలో ఎనిమిది ఈడీ టీంలు హైదరాబాద్ కో క్యాసినో పేరుతో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారాల పైన విచారణ చేసింది. కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. సెలబ్రెటీలతో ప్రవీణ్ కు ఉన్న సంబంధాల పైన కీలక సమాచారం వెల్లడైనట్లు తెలుస్తోంది. అందులో రాజకీయ ప్రముఖులతో పాటుగా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

సినీ సెలబ్రెటీలు - రాజకీయ నేతలు

సినీ సెలబ్రెటీలు - రాజకీయ నేతలు


ప్రవీణ్ ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి నేపాల్..శ్రీలంక..ఇండోనేషియాలో నిర్వహించిన క్యాసినోకు ఇక్కడ నుంచి తీసుకెళ్లేవారని గుర్తించారు. ఇందుకోసం ప్రయివేటు విమానాలకు లక్షలాది రూపాయాలు చెల్లించినట్లుగా తేల్చారు. అదే సమయంలో కస్టమర్ల నుంచి ఒక్కక్కరి నుంచి రూ 5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు గుర్తించారు. ఈ ప్రమోషన్లకు సంబంధించి సినీ తారలకు అందిన నగదు..ఆర్దికంగా ప్రయోజనాల పైన ఈడీ పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. నేపాల్ కేంద్రంగా నిర్వహించిన క్యాసినోకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు ఈడీ తేల్చింది.

ప్రవీణ్ ల్యాప్ టాప్ లో పూర్తి సమాచారం

ప్రవీణ్ ల్యాప్ టాప్ లో పూర్తి సమాచారం


ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు హాజరైనట్లు గుర్తించారు. గుడివాలో సంక్రాంతి సమయంలో వివాదంగా మారిన క్యాసినో నిర్వహణ అంశంలోనూ ప్రవీణ్ పాత్ర పైన ఆరా తీసారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. ప్రవీణ్ లాప్ టాప్ లో సినీ సెలబ్రెటీలతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ప్రస్తుత మంత్రి..ఒక మాజీ మంత్రితో ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయని సమాచారం. నేపాల్ కు ప్రవీణ్ తీసుకెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం వ్యాపారులు కొందరు ప్రవీణ్ ను హవాలా కోసం వినియోగించుకున్నట్లుగా చెబుతున్నారు.

విచారణ పై ఉత్కంఠ..ప్రముఖుల్లో టెన్షన్

విచారణ పై ఉత్కంఠ..ప్రముఖుల్లో టెన్షన్


పెద్ద మొత్తంలో హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించిన ఈడీ మనీ లాండరింగ్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఇక, పూర్తి సమాచారం ప్రవీణ్ నుంచి రాబట్టేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటి పైన ప్రవీణ్ స్పందించారు. తాను విచారణకు హాజరవుతానని.. క్యాసినో విషయంలోనూ తమ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసారంటూ చికోటి ప్రవీణ్ వెల్లడించారు. దీంతో..రాజకీయ - రాజకీయ ప్రముఖులతో సంబంధాలు..వారితో జరిగిన ఆర్దిక లావాదేవీల పైన ఈడీ అధికారులు మరింత స్పష్టత కోరే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో ఇప్పుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది.

English summary
ED issues notices to Praveen and MAdhava Reddy in Casino row, Praveen link with many celebrities in cine and political circels
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X