రేపటి నుంచి తెలంగాణలో కులగణన రీ సర్వే.. ఫోన్ చేస్తే ఇంటికొస్తారు..

Caste Census re Survey: తెలంగాణ సర్కారు నిర్వహించిన సర్వేలో దాదాపు 3 లక్షల కుటుంబాలకు పైగా తమ వివరాలను నమోదు చేసుకోలేదు. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కులగణనలో నమోదు చేసుకోని వారు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. కులగణన వివరాల నమోదుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111ను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది. ఇప్పటి వరకు కులగణన సర్వేలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అడ్రస్ తో పాటు పోస్టల్ పిన్ కోడ్ నంబర్ ను తెలియజేయాల్సి ఉంటుంది.

ఫోన్ చేసిన వాళ్లు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఎన్యుమరేటర్లు వారి ఇంటికి వెళ్లి కులగణన చేయనున్నారు. మొబైల్ నంబర్ తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్ లో నమోదు అయ్యారా లేదా అనే వివరాలను పరిశీలించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను స్వీకరించి ఆయా జిల్లా కలెక్టర్లకు ఫార్వార్డ్ చేయనున్నారు. మరోవైపు ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తెలంగాణలో 3,56, 323 కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొనలేదని అధికారులు చెప్పారు

Caste Census re Survey in Telangana from February 16 to 28

గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రభుత్వం మొదటి సారి కులగణన సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు ఈ సర్వేలో భాగంగా వివరాలను సేకరించారు. వివరాలు సేకరించిన అనంతరం ఓ రిపోర్టును ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ నివేదిక సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం ఆ నివేదికను కేబినెట్ కు పంపింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలపడంతో.. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఈ కులగణనపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+