చేతులు కాలాక.. నేరేళ్ళ ఘటనలో ఎస్ఐ రవీందర్‌పై వేటు
రాజన్నసిరిసిల్ల: నేరేళ్ళ ఘటనపై చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా ప్రభుత్వం తీరు ఉంది. ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ఈ అంశాన్ని ఉపయోగించుకొన్నాయి. అయితే డిఐజీ రవివర్మ నివేదిక ఆధారంగా ఎస్ఐ రవివర్మపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
నేరేళ్ళలో ఇసుక లారీలను తగులబెట్టారనే కారణంగా ఈ ఘటనకు పాల్పడినవారిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు దళితులని కూడ చూడకుండా దాడులకు పాల్పడ్డారని పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
విపక్షాలు నేరేళ్ళ బాధితులను పరామర్శించి వచ్చిన తర్వాత చివరిసారిగా మంత్రి కెటిఆర్ వేములవాడలో ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

ఈ ఘటనపై డిఐజీతో విచారణ జరిపిస్తామని కెటిఆర్ రెండు రోజుల క్రితం బాధితులను పరామర్శించిన తర్వాత ప్రకటించారు. మంత్రి హమీ మేరకు ఈ ఘటనపై డిఐజీ రవివర్మ విచారణ చేశారు.
ఈ ఘటనకు సిసిఎస్ ఎస్ఐ రవీందర్ అత్యుత్సాహమే కారణమని డిఐజీ నివేదిక ఇచ్చారు. రవీందర్ అతి ఉత్సాహన్ని చూపి విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేశారని నివేదికను ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా రవీందర్‌పై ఐజీ నాగిరెడ్డి చర్యలు తీసుకొన్నారు. రవీందర్‌ను సస్పెన్షన్ చేస్తున్నట్టు ఐజీ ప్రకటించారు.ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications