హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని రాష్ట్రంలోని 195 కేంద్రాల్లో క్రైస్తవులకు ఈ నెల 16న దుస్తులు పంపిణీ చేయాలని, 19న క్రిస్మస్ విందు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం తరుపున హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో అధికారిక కార్యకమ్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. క్రిస్టియన్ మత పెద్దలు, పాస్టర్లు, బిషప్‌లను ఆహ్వానించాలని తెలిపారు. క్రైస్తవుల అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసిన ఐదుగురిని ఎంపికచేసి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన గౌరవం, అన్ని పండుగలకు సమాన గుర్తింపు లభించాలన్నదే తమ అభిమతమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ, బోనాలు, రంజాన్ పండుగలను అధికారికంగా ఘనంగా నిర్వహించామన్నారు.

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం, శాంతి వెల్లివిరియాలన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం అన్ని మతాల పండుగలను ప్రభుత్వ పండుగలుగానే గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఎన్నో మతాలున్న భారతదేశంలో చాలా పండుగలు జరుగుతాయని, వాటిని ప్రజలు సంతోషంగా జరుపుకోవడం వల్ల ఎప్పుడూ మంచి వాతావరణం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఈ సమావేశం అనంతరం మాజీ డిప్యూటీ సీఎం టీ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత క్రైస్తవుల పక్షపాతి అని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.15.37 లక్షలతో రెండు లక్షల మంది క్రైస్తవులకు దుస్తుల పంపిణీతో పాటు విందు ఇస్తున్నారన్నారు. 20న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ప్రభుత్వం విందు ఏర్పాటు చేస్తున్నట్లు రాజయ్య తెలిపారు.

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని 100 నోడల్ చర్చిల్లో ఒక్కో చర్చి పరిధిలో వెయ్యి మందికి దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఐదువేల మంది వృద్ధులు, మరో ఐదువేల మంది అనాథలకు దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

ఘనంగా క్రిస్మస్: దుస్తుల పంపిణీ, నిజాం కాలేజీలో విందు

తన నియోజకవర్గానికి అధిక కోటా కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు రాజయ్య ధన్యవాదాలు తెలిపారు. దళితులతో సమానంగా దళిత క్రైస్తవులకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, టీ రాజయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు రేమండ్ పీటర్, ఉమర్‌జలీల్, అధర్‌సిన్హా, ఏకే ఖాన్, భూపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

English summary
Chief Minister K Chandrashekar Rao on Tuesday directed the officials to celebrate Christmas as a State festival on a grand scaley. At a meeting with the officials, he said all people should live with self-dignity and religious harmony and that was why the government wanted to hold festivals of all religions as State festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X