హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మొబైల్ రంగంలో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామికవాడలో రూ. 200 కోట్ల పెట్టుబడితో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 'సెల్ కాన్ సంస్ధ మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్' ను నెలకొల్పింది.

దీనిని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, స్ధానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఐటీ సంస్ధలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు.

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


కొత్తగా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన సంస్థలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


దీంట్లో భాగంగా రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టులకు ఊతమివ్వనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులకు పన్ను రాయితీలు, మౌలిక వసతులు కల్పించడం, అవసరమైతే ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరించేందుకైన సిద్ధమని ప్రకటించారు.

 మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


మేక్ ఇన్ తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు ఎటువంటి సవరణలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏరోస్పెస్ రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆ పరిశ్రమకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.

 మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


మేడ్చల్‌లో మొదటి విడుతలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న మొబైల్స్ తయారీ యూనిట్‌లో నెలకు 2 లక్షలకు పైగా ఫీచర్ ఫోన్లు ఉత్పత్తి చేస్తామని సెల్‌కాన్ సీఎండీ వై గురు తెలిపారు.

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటులో ప్రస్తుతానికి నాలుగు లైన్లను ఏర్పాటు చేశామని, వచ్చే మూడు నెలల్లో 12 లైన్లకు విస్తరిస్తామని చెప్పారు.

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


అలాగే 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగిని, ముడి సరుకు నిల్వ చేసేందుకు మరో 5 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో వేర్‌హౌజ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'

మేకిన్ తెలంగాణ: 'ఇది ఆరంభం మాత్రమే'


ఈ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి లభించనున్నదని సెల్‌కాన్ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని చెప్పారు.

మన దేశంలో కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్స్‌ను వాడుతున్నా దేశీయ ఉత్పత్తులు చాలా తక్కువగా ఉంటున్నాయని అన్నారు. ఒక దేశీయ మొబైల్ సంస్థ రాష్ట్రంలో యూనిట్‌ను ఏర్పాటు చేయటం గర్వంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమే.

ప్రస్తుతం సెల్‌కాన్, ఆ తర్వాత మైక్రోమ్యాక్స్, భవిష్యత్తులో మరిన్ని మొబైల్ సంస్థలు ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు ధీటుగా మొబైల్ తయారు చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని ఆయన ఆకాక్షించారు.

English summary
A number of mobile phone manufacturers are considering setting up units in Telangana, the State's IT Minister K.T. Rama Rao said on Friday. Inaugurating a facility of smartphone maker Celkon, which has been outsourcing from China, the Minister declared: "This is just the beginning. Chief Minister K. Chandrasekhar Rao is keen on a having a mobile manufacturing hub in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X