దేవుడి స్క్రీన్ ప్లే: స్మశానం కట్టించాడు.. ఓపెనింగ్ ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు!!

తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు ఒక్కోసారి జరిగే సంఘటనలు మనల్ని షాక్ కు గురి చేస్తూ ఉంటాయి. ఊరి వాళ్ళందరికీ ఉపయోగపడాలని స్మశానం నిర్మించిన ఒక సర్పంచ్ ఆ స్మశానాన్ని ప్రారంభించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దేవుడు చేసిన స్క్రీన్ ప్లే లో తన పాత్ర పోషించి చివరకు ఊహించని విధంగా ఆయన వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ స్మశానం చివరకు ఎలా ప్రారంభమైంది అంటే..

హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లి గ్రామ సర్పంచ్ 25 సంవత్సరాల కంచ కుమారస్వామి. ఇటీవల హైబత్ పల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించడంతో పంచాయతీ నిధులతో గ్రామంలో ఆయన స్మశాన వాటికను నిర్మింపజేశారు. కంచ కుమారస్వామి నిర్మించిన స్మశాన వాటికను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అయితే కంచ కుమారస్వామి కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు.

cemetery

గతంలో అడ్తీ వ్యాపారం చేసే కంచ కుమారస్వామి పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అడ్తీ వ్యాపారం వదిలెయ్యటంతో ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఆయన భార్య భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి ఏప్రిల్ నెల 29వ తేదీన పురుగుల మందు తాగాడు. వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆయన నిన్న మరణించారు.తాను నిర్మించిన వైకుంఠధామాన్ని ఎవరైనా ముఖ్య నాయకులను, అధికారులను పిలిచి ప్రారంభోత్సవం చేయాలని భావించిన కంచ కుమారస్వామి ఆ పని చేయకుండానే తనువు చాలించాడు.

దీంతో సర్పంచి కట్టించిన స్మశాన వాటిక లోనే కంచ కుమారస్వామి అంత్యక్రియలను నిర్వహించారు. స్మశాన వాటిక ప్రారంభోత్సవాన్ని ఆయన తొలి దహనసంస్కారాలతో నిర్వహించారు. ఈ దురదృష్టకరమైన సంఘటనతో గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకున్నారు. స్మశానం కట్టిస్తే నీ అంత్య క్రియలే తొలిగా చేస్తామని అనుకోలేదు అంటూ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+