తెలంగాణాకు కేంద్రం వరాలు.. నాలుగు నేషనల్ హైవే ప్రాజెక్ట్ లకు ముహూర్తం ఖరారు!
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రభుత్వం దేశ ప్రగతికి రవాణా సౌకర్యాలు కీలక భూమిక పోషిస్తాయి అనే విషయాన్ని గుర్తించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రం వరాలను ఇచ్చింది.
నాలుగు నేషనల్ హైవేలు
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 271 కిలోమీటర్ల మేర నాలుగు భారీ ప్రాజెక్టులు నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు 10,034 కోట్లు.

మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్ ఎన్ హెచ్167
ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టి, రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేసి, రాష్ట్రం యొక్క ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి దోహదం చేయనుంది.ఇక కేంద్రం త్వరలో ప్రారంభించనున్న ఆ నాలుగు ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే ఎన్ హెచ్167. మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ 80కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఆర్మూరు జగిత్యాల, జగిత్యాల కరీంనగర్ నేషనల్ హైవేలు
ఎన్ హెచ్ 63 అండ్ ఎన్ హెచ్ 563.. ఆర్మూరు జగిత్యాల నేషనల్ హైవే. ఈ సెక్షన్ లోని జాతీయ రహదారి విస్తరణ పనులు చేయడానికి కేంద్రం సంకల్పించి టెండర్లను ఆహ్వానించింది. ఇక మరొక నేషనల్ హైవే ప్రాజెక్ట్ జగిత్యాల కరీంనగర్ ఎన్ హెచ్ 563, 58 . 60 కిలోమీటర్ల ఈ మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ హైవే నిర్మాణం టెండర్లను ఆహ్వానిస్తున్న దశలో ఉంది.
జగిత్యాల మంచిర్యాల నేషనల్ హైవే
ఎన్ హెచ్ 63 జగిత్యాల మంచిర్యాల.. 66.295 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. దీనికోసం కూడా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులను 2026 ఫిబ్రవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంతోపాటు ఆ ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి.












Click it and Unblock the Notifications