వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాకు కేంద్రం షాక్: బొగ్గుబ్లాకుల వేలంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి; టీఆర్ఎస్ కు చురకలు!!

|
Google Oneindia TeluguNews

బొగ్గు బ్లాకుల వేలంపై కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. పార్లమెంట్ వేదికగా బొగ్గు బ్లాకుల వేలంపై కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మె కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణి 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు చేపట్టిన సమ్మె పై ఈరోజు పార్లమెంట్లో చర్చ జరిగింది.

బొగ్గు బ్లాకుల వేలంపై పార్లమెంట్ లో ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

బొగ్గు బ్లాకుల వేలంపై పార్లమెంట్ లో ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు బ్లాకుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని లోక్ సభ జీరో అవర్లో అత్యవసర ప్రజా ప్రయోజనాల అత్యవసర అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన డిమాండ్ పై కేంద్ర స్పందించింది. ఇక బొగ్గు బ్లాకుల వేలం పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి, కొత్తగూడెం, కళ్యాణ్ ఖని, శ్రావణ పల్లి బ్లాకులు సింగరేణిని ఆనుకునే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50 వేల మంది సింగరేణి బొగ్గు గని కార్మికులు బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని, దీనివల్ల సింగరేణి రోజుకు 120 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు బ్లాకులను తెలంగాణా రాష్ట్రానికి అప్పగించాలని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సమ్మె అన్న కేంద్ర మంత్రి

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సమ్మె అన్న కేంద్ర మంత్రి

ఈ బొగ్గు గనుల వల్ల ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ధర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను సింగరేణి తీరుస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు .టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వేలం ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇది విధాన నిర్ణయమని పేర్కొన్నారు.

పాలసీ మ్యాటర్.. బొగ్గు గనులు రాష్ట్రాలకు కేటాయించలేము

పాలసీ మ్యాటర్.. బొగ్గు గనులు రాష్ట్రాలకు కేటాయించలేము


గతంలో యూపీఏ హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు అందరికీ తెలుసు అని ప్రస్తావించిన ఆయన రాష్ట్రాలకు అప్పుడు గనులను కేటాయించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పని చెయ్యలేమని తేల్చిచెప్పారు. ఒకవేళ బొగ్గుగనులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ నోటీసు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ వాస్తవాల ఆధారంగా లేదని తేల్చి చెప్పారు. సింగరేణిలో సమ్మె జరగడం దురదృష్టకర సంఘటన అని అభివర్ణించిన ఆయన, దీనికి సంబంధించి మంత్రి, అధికారులతో మాట్లాడితే సరిపోయేదని తేల్చారు.

 బొగ్గు గనుల వేలం ప్రక్రియ మొదలైంది: ప్రహ్లాద్ జోషి

బొగ్గు గనుల వేలం ప్రక్రియ మొదలైంది: ప్రహ్లాద్ జోషి


బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ జరిగి తీరుతుందని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోయేది లేదని స్పష్టం చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను సమర్ధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇది పాలసీ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనతో బొగ్గు బ్లాకుల వేలం ఆగదని స్పష్టం అయ్యింది. ఇది తెలంగాణా సర్కార్ కు ఒకింత షాక్ అనే చెప్పాలి.

English summary
The Center gave a shock to Telangana. The Union Minister made a key announcement in Parliament on the auction of coal blocks. He said it was a policy decision, incensed that the strike was only for the benefit of trs government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X