అమిత్ షా వర్సస్ కేసీఆర్ : పొలిటికల్ సెంటిమెంట్ అస్త్రాలు : ఒకే సారి పోటా పోటీగా..!!
తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయాల్లో.. ఇప్పుడు మరో సారి కీలక అంశంపైన పొలిటికల్ వార్ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వం పోటా పోటీగా సెప్టెంబర్ 17 అధికారిక కార్యక్రమాల నిర్వహణకు సిద్దమయ్యాయి. అందులో భాగంగా ఈ నెల 17న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందు కోసం కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా కర్ణాటక..మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

అమిత్ షా - ఇద్దరు సీఎంలు
ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ప్లాన్ సిద్దం చేసారు. దీనికి ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. చాలా కాలంగా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ నేతలు..ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకల నిర్వహణకు నిర్ణయించింది.
ఈ నెల 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొననున్నారు.

కేసీఆర్ కౌంటర్ ప్లాన్ రెడీ
గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేసారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ కూడా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల పేరుతో ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.
భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేయడం, నాడు తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, పోరు జరిగిన కేంద్రాలను స్మరణకు తెచ్చుకోవడం, ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త టర్న్
రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలిసింది. శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
దీంతో..ఇప్పుడు ఈ నెల 17న అటు కేంద్రం ..ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు.. రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. సెంటిమెంట్ ను ఓన్ చేసుకొనేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది నేటి కేబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications