నీటి రగడ: సీఎంలతో భేటీపై కసరత్తు, 19న వస్తానని, బాబు, 21న కలుద్దామని కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా నది పైన ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులతో ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది.
జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఈ నెల 11, 18, 19 తేదీల్లో సమావేశం కోసం మీ వెసులుబాటును తెలపాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీకి మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం 21వ తేదీన ఈ సమావేశం నిర్వహించాలని కోరినట్లుగా సమాచారం. నీటి ప్రాజెక్టుల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం పైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.

కాగా, నీటి సంక్షోభం దుప్షలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు అని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం ఆయన నీరు-ప్రగతిపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. నీటి కోసం ఘర్షణలకు దారి తీయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదనే నీరు-ప్రగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications