తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. మరో విమానాశ్రయం !
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు ప్రకటించినది. రాష్ట్రంలో కొత్తగా మరో విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్డీయే సర్కారు. ఇప్పటికే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలుపగా.. ఇప్పుడు ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి ఇదే నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్త అని మంత్రి పేర్కొన్నారు. ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా అనుమతులు సాధించడం పట్ల హర్షం గొప్ప విషయం అన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు అనుమతులు రావడం పట్ల కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాలు, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించిందన్నారు. అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని అధికారులు లేఖలో సూచించారని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్న ప్రధాని మోడీకి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications