తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. లోక్ సభ - అసెంబ్లీ స్థానాల పునర్విభజన రాష్ట్ర రాజకీయ స్వరూపాన్నే మార్చేస్తోంది. కేంద్ర తాజా నిర్ణయం సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న ఎంపీ- ఎమ్మెల్యే స్థానాలు భారీగా పెరగనున్నాయి. ప్రతీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెంచేందుకు రంగం సిద్దమైంది. కొత్త నియోజకవర్గాల పైనా దాదాపు స్పష్టత వస్తోంది. అయితే, రాజకీయంగా కలిసొచ్చే లెక్కలు మాత్రం ఆసక్తి కరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికలు 2028 కాదు. 2029 లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం తాజాగా ఎంపీ- ఎమ్మెల్యే స్థానాలు 50 శాతం మేర పెంచుతూ... మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు మరో 60 పెరిగి 179కి చేరుకునే అవకాశం ఉంది. అలాగే, 17 గా ఉన్న లోక్‌సభ స్థానాలు 26కు పెరగనున్నాయి. జిల్లాల వారీగానూ పెరిగే సీట్ల పైన లెక్క స్పష్టత వచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 22 స్థానాలు పెరగనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 ఇక 22 కానున్నాయి. అదే విధంగా మేడ్చల్ పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. రంగారెడ్డిలోనూ 13 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పోరేషన్లుగా విభజన చేయటంతో.. ఇప్పుడు రాష్ట్రంలో అధికంగా అసెంబ్లీ స్థానాలు ఈ మూడు కార్పోరేషన్ల పరిధిలోనే పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.
మారుతున్న లెక్కలు... పార్టీల అంచనాలు
ఇక, కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ స్థానాలుగా బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హియాయత్ నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు ఖావటం ఖాయంగా చెబుతున్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు లోక్ సభ స్థానాలు రానున్నాయి. మల్కాజ్ గిరి పరిధి కుదించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా పాతబస్తీ ప్రాంతాన్ని కొత్తగా ఏర్పాటయ్యే లోక్ సభ పరిధిలోకి చేర్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా, ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందనే కీలక అంశంగా మారుతోంది.
హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధి నిర్ణయం ఉత్కంఠ గా కనిపిస్తోంది. అదే విధంగా గ్రేటర్ పరిధిలో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లలో విజయం సాధించింది. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అటు ఎంఐఎం ఇప్పుడు జరిగే డీలిమిటేషన్ ద్వారా మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని భావిస్తోంది. బీజేపీ సైతం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే, 2011 జనాభా లెక్కల మేరకే డీలిమిటేషన్.. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తుండటంతో.. వీటికి తుది రూపు వచ్చిన తరువాత ఎవరిది పై చేయి అనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు













Click it and Unblock the Notifications