మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ బండ

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆయన కోరారు. మేడారం జాతరను రాష్ట్ర పండగగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు కోట్లాదిగా భక్తులు తరలివస్తారని ఆయన ఎంపీ బండా ప్రకాశ్ వివరించారు.

పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమ్మక్క-సారలమ్మను గతంలో దర్శించుకున్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. మేడారం అభివృద్ధికి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించాలని, గిరిజనుల జాతర ప్రసిద్ధి చెందిన మేడారంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.

centre must give national status to medaram jatara: TRS MP Banda Prakash

కాగా, మేడారం మహా జాతర ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఈ నాలుగు రోజుల్లో లక్షలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. ఫిబ్రవరి 7 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికిపైగా భక్తులు వనదేవతలను దర్శించుకోగా.. ఫిబ్రవరి 8 వరకు కోటి మందికిపైగా భక్తులు మేడారంను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ నిజం చేస్తున్నారు..
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ నిజం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా వేలాది గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని నామా చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా గత నాలుగేళ్ల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తున్నామని తెలిపారు.
భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+