హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 లక్షల కోట్లు దాటిన తెలంగాణ అప్పులు: మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అప్పులు వివరాలను తెలియజేసింది. తెలంగాణపై అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది.

2018లో రూ. లక్షా 60వేల 696.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ. 3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది. లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్, రంజిత్ రెరెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికర్ధిశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గతమూడేళ్లుగా అప్పుల శాతం
పెరుగుతూ పోతోం దని కేంద్రం పేర్కొం ది.

2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వా త భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికర్ధిశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వెల్లడించింది.

Centre reveals about Telangana debts and metro projects details in Parliament

తెలంగాణలో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం

తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుల రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్. హైదరాబాద్ మెట్రో కారిడార్ పేజ్-2 కింద తెలంగాణ సర్కారు మెట్రో ప్రాజెక్టును మొదలుపెడుతోందని చెప్పారు. ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా కలుపుతోందన్నారు.

ఇక వరంగల్ నియో మెట్రో కింద 15.5 కిలోమీటర్లకు రూ. 998 కోట్లతో ప్రపోజల్ వచ్చిందని తెలిపారు. కేంద్రమంత్రిత్వ శాఖ సూచించిన మార్పులతో మరోసారి ప్రపోజల్ పంపాలని సూచించామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు సంబంధించి ఎలాంటి ప్రపోజల్స్ రాలేదని వెల్లడించారు. కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును విస్తరించే పనులను ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

English summary
Centre reveals about Telangana debts and metro projects details in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X