కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కాంగ్రెస్ పార్టీకి ఈసీ నోటీసులు

బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ ​రాజ్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషిస్తున్నారని బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కేసీఆర్‌​ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్​‌కు సీఈవో వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్‌​ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది.

CEO Vikas Raj Issued Notices to Congress party due to Revanth reddy comments on kcr

బీఆర్ఎస్ ఫిర్యాదు ఆధారంగా సీఈవో వికాస్​ రాజ్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదును సీఈవో కార్యాలయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్‌​కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వివరణ రాకపోతే, ఏమీ చెప్పేది లేదని భావించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్

బీఆర్​ఎస్​ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌​కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓయూ సర్క్యులర్‌​ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో ఇటీవలే ఓయూ పోలీసులు క్రిశాంక్‌​పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్‌​గూడ జైల్లో ఉన్న ఆయనకు కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ఈ కేసు ఏమిటంటే?

ప్రతి ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మెస్​‌లు మూసివేతపై సర్క్యులర్‌ ​జారీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్‌ జారీ చేయగా.. వాటిపై సోషల్ మీడియాలో తప్పుడు దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ఇం​ఛార్జి క్రిశాంక్​, నాగేందర్​‌లను అదుపులోకి తీసుకున్నారు. మే 1న హైదరాబాద్​ నుంచి కొత్తగూడానికి వీరిద్దరు వెళుతుండగా పంతంగి టోల్​‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చౌటుప్పల్‌ పట్టణ పోలీసులు స్థానిక ష్టేషన్‌‌ కు తీసుకెళ్లారు. తర్వాత ఓయూ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి క్రిశాంక్‌ను అప్పగించారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రిశాంక్‌కు బెయిల్ లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+