38 కేసులు, స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు: ఓటింగ్ శాతంపై రేపటికి స్పష్టత: వికాస్ రాజ్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు.
తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు(మంగళవారం) వెల్లడిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. సోమవారం వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామన్నారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.

అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కేంద్రం ఆధ్వర్యంలో ఉండే యాప్ లలో 415 ఫిర్యాదులు రాగా, వేర్వేరు ప్రాంతాల్లో ఈరోజు 38 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. 225 ఫిర్యాదులు సీవిజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు.
మొత్తం రూ.330 కొట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్ కొనసాగిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూంలు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు.
భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరతాయని తెలిపారు. ఖచ్చితమైన పోలింగ్ శాతం రేపు(మంగళవారం) మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు. పోలింగ్ పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే రేపు తెలుస్తుందని వెల్లడించారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications