DSC 2024: డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి..!

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ వేగంగా సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. డీఎస్సీ నిర్వహించింది. అంతేకాదు తక్కువ సమయంలోనే ఫలితాలు విడుదల చేసింది. తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ-2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారంతో పూర్తయింది. అక్టోబర్ 1న వెరిఫికేషన్ ప్రారంభం అయింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున మొత్తంగా 25,622 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలవగా, 24,454 మంది హాజరయ్యారు.

హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి 18 జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తెలిపారు. 18 జిల్లాల్లో ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా.. వారికి ఆదివారం సర్టిఫికేషన్ వేరిఫికేషన్ చేయనున్నారు. అక్టోబర్ 9న ఎల్​బీ స్టేడియంలో ఎంపికైన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు.

Certificate verification of selected candidates for DSC 2024 has been completed

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఇటీవలనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉండగా.. లాంగ్వేజ్ పండిట్ ఉద్యోగాలు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు 796 ఉన్నాయి. అయితే డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) రెండింటీకి ఎంపికైతే.. ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది.

2008 డీఎస్సీ లో ఎంపికైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అప్పటి జాబితా పంపాలని అధికారులను కోరింది. అయితే అధికారులు జాబితా తయారీలో గోల్ మాల్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో జాబితాలో 15 మంది పేర్లు గల్లంతయ్యాయి. బాధితులు అధికారులను నిలదీయడంతో ఏడుగురు పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది. మిగతావారు కూడా తమ పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+