కాక రేపుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ‘సెస్’ ఎన్నికలు.. ఎందుకంటే!!

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పొలిటికల్ హీట్ మామూలుగా ఉండటం లేదు. ఇక నేడు జరగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికలు కూడా అంతే పొలిటికల్ హీట్ ను పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలే కాదు ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న సెస్ ఎన్నికల్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది.

కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల పోలింగ్

కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల పోలింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఈ పొలిటికల్ హీట్ కనబడుతుంది. 15 డైరెక్టర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు నేడు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. 87 వేల 130 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

భారీ బందోబస్తు నడుమ సెస్ ఎన్నికలు.. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం

భారీ బందోబస్తు నడుమ సెస్ ఎన్నికలు.. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం

సెస్ లో నమోదైన విద్యుత్ వినియోగదారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సెస్ ఎన్నికల బరిలో 75 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. ఇక పోలీసుల భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న సెస్ ఎన్నికలలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది.

ఏకంగా 11 వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సెస్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం చేసిన అధికార ప్రతిపక్ష పార్టీలు.. బండి సంజయ్ క్యాంపెయిన్

ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం చేసిన అధికార ప్రతిపక్ష పార్టీలు.. బండి సంజయ్ క్యాంపెయిన్

ముఖ్యంగా సెస్ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టుగా రాజకీయం సాగుతుంది. ఈ ఎన్నికలకు ఎటువంటి ఎలక్షన్ కోడ్ లేకపోవడంతో గురు శుక్ర వారాల్లో సైతం ప్రచారం జోరుగా సాగింది.బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలలో అగ్ర నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటించి, సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బి ఆర్ఎస్ ను టార్గెట్ చేశారు.

టెలీ కాన్ఫరెన్స్ లో ఓటర్లతో మాట్లాడిన కేటీఆర్

టెలీ కాన్ఫరెన్స్ లో ఓటర్లతో మాట్లాడిన కేటీఆర్

ఇక మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల తో మాట్లాడారు. తనను చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మరి నేడు ఓటర్లు ఓటు వేస్తున్న నేపథ్యంలో ప్రజల మద్దతు ఎవరికి ఉంది అన్న దానిపైన అన్ని పార్టీలలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+