అమీర్‌పేటలో చైన్‌స్నాచర్ ఘాతుకం: మహిళను కత్తితో పొడిచాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్ మరోసారి రెచ్చిపోయాడు. తన మెడలోని బంగారు అభరణాన్ని కోట్టేయబోయిన చైన్ స్నాచర్‌ను అడ్డుకున్న మహిళను అతి దారుణంగా కత్తితో పారిపోయిన సంఘటన సోమవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కుమ్మరి బస్తీ ప్రాంతంలో నడుస్తున్న మహిళ మెడ నుంచి గొలుసును లాక్కెళ్లేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. గొలుసు గట్టిగా ఉండటంతో అతి తెగలేదు. దీనిని అడ్డుకున్న మహిళను చైన్ స్నాచర్ కత్తితో బెదిరించాడు. ఈలోగా మహిళ కేకలు పెడతూ, గట్టిగా అరిచింది.

Chain Snatchers Hulchul in Ameerpet, Hyderabad

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రపెనుగులాట జరగడంతో ఆ దుండగుడు ఆమెను కత్తితో పొడిచాడు. దీనిని గుర్తించిన స్థానికులు అప్రమత్తమయ్యేలోపే చైన్ స్నాచర్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగను గుర్తించేందుకు స్థానికంగా ఉన్న షాపులు, రహదార్లపై సీసీ కెమెరాల పుటేజ్‌లను సేకరిస్తున్నారు.

చైన్ స్నాచర్ దాడిలో గాయపడిన బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A chain snatcher attacked a woman in Ameerpet, Hyderabad. In this incident wwman got injured. Police came and file a complaint.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X