వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కుటుంబంలో అందరూ జల్సా: తెలుగులో బృందా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ పదవులతో జల్సా చేస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ గురువారం ధ్వజమెత్తారు.

ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఆయన తుంగలో తొక్కారని చెప్పారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం నిర్వహించిన విగ్రహావిష్కరణలో ఆమె మాట్లాడారు.

మొదట తెలుగులో మాట్లాడి స్థానికులను బృందాకారత్ ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడుతూ.. హక్కుల సాధనకు పోరాటతత్వంతో ప్రభుత్వం మెడలు వంచాలన్నారు.

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతమందికి ఇచ్చారో స్పష్టంగా చెప్పాలన్నారు.

 చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

వామపక్ష పార్టీలు భూమికోసం పోరాటాలు చేస్తుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ భూ ఆర్డినెన్స్‌తో అణగదొక్కాలని చూస్తోందన్నారు.

 చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

రైతుల భూములను లాక్కోవడం సరికాదని బృందాకారత్ అన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఐలమ్మ మెడలో పూలదండ వేస్తుంటే శరీరం పులకించిందన్నారు.

 చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ - వరంగల్లో బృందా కారత్

తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత, స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... ఐలమ్మ పేరుతో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలా ఉండగా, పాలకుర్తి ఉప మార్కెట్ యార్డుకు చాకలి ఐలమ్మ పేరు పెడుతూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
Chakali Ilamma statue unveiled in Warangal district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X