కేసీఆర్ కీలక ప్రకటన దిశగా- ముహూర్తం ఫిక్స్ : కేబినెట్ - పార్టీ కీలక సమావేశం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కీలక రాజకీయ ప్రకటన దిశగా సిద్దం అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ పైన కేసీఆర్ ఇప్పటికే సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని ముఖ్యలు..పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించారు. అభిప్రాయాలు స్వీకరించారు. కానీ, మూడు నెలల క్రితమే నిర్ణయం ఉంటుందని చెప్పినా..ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి ప్రకటన లేదు. తాజాగా.. 26 రాష్ట్రాల రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
Recommended Video

కేసీఆర్ జాతీయ రాజకీయాలు
పెద్దపల్లిలో జరిగిన సభలో మరోసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అంటూ ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో పోరాటం చేద్దాం.. బీజేపీ విముక్త భారత్ లక్ష్యంతో పని చేద్దామని నినదించారు. ఈ క్రమంలో భాగంగా.. సెప్టెంబర్ 3న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు. అదే విధంగా కేబినెట్ పూర్తి కాగానే.. పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు. కేబినెట్ సమావేశంతో పాటుగా.. ఈ సమావేశం ఒకే రోజు ఏర్పాటు చేయటం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకే రోజు కేబినెట్.. పార్టీ సమావేశం
అయితే, పార్టీ నేతలు మాత్రం తాజాగా.. పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల పైన చర్చ ఉంటుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా రూపాంతరం చెందేలా గతంలోనే సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఇప్పుడు దీనికి పార్టీ కార్యవర్గం అధికారిక ఆమోదం అవసరం. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పైన వివరించటంతో పాటుగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ మరోసారి వివరించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది.

జాతీయ పార్టీగా టీఆర్ఎస్ మారబోతోందా..
ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రేపు ( బుధవారం) సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. తాజాగా. .ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి..ఆర్జేడి మద్దతుతో నితీశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇక, ఈ వరుస సమావేశాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయనున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications