చాందిని అప్పుడే విషయం చెప్పి ఉంటే, దూరం ఉంచాలని విఫలమయ్యాడు

Posted By:
Subscribe to Oneindia Telugu
Chandini Jain mysterious case,It was Premeditated:చాందిని అప్పుడే విషయం చెప్పి ఉంటే| Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. కేసు ఛేదనలో సిసి ఫుటేజీ కీలకంగా మారింది. అయితే ఫుటేజీతో పాటు మరికొన్ని అంశాలు నిందితుడిని పట్టించాయి.

చాందినితో తిరిగాడు: నిందితుడి తండ్రి, ఆ ఇద్దరితో హోటల్లో హద్దు మీరి ఉంటుందనే హత్య

చాందిని ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు, చాందిని కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చాందిని అక్క ఆరున్నర గంటలకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.

వారం రోజులుగా ముభావంగా

వారం రోజులుగా ముభావంగా

చాందినికి, నిందితుడికి గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అంతేకాదు, తాను పెళ్లి చేసుకోనని అతను చెప్పడంతో బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. హత్యకు ముందు వారం రోజులుగా ఆమె ముభావంగా ఉంది. దీనిపై తల్లి ఆరా తీసింది. కానీ ఆమె చెప్పలేదు. అప్పుడే చెప్పి ఉంటే మరోలా ఉండేదని అంటున్నారు.

మైహార్ట్ కీలకం

మైహార్ట్ కీలకం

సీసీపుటేజీలో ఇద్దరిని గుర్తించినప్పటికీ బాలుడి ముఖం సరిగా కనిపించకపోవడంతో పోలీసులు ఆటో నెంబర్‌ ఆధారంగా డ్రైవర్‌ను పిలిపించారు. ఇద్దరు వచ్చిన మాట వాస్తవమేనని బాలుడిని కూడా ఆటో డ్రైవర్‌ గుర్తించాడు. అయితే మైహార్ట్‌ ఫోన్‌ నెంబర్‌ ఫోన్‌కాల్‌ డేటాలో పదేపదే ఉండటంతో అది ఆ బాలుడి నెంబరని పోలీసులు గుర్తించడంతో అప్పటి వరకు బుకాయించిన అతడు తానే చంపానని అంగీకరించాడు.

రెండు నెలల కాల్ డేటా సేకరణ

రెండు నెలల కాల్ డేటా సేకరణ

పోలీసులు కేసును ఛేదించేందుకు 2 నెలల కాల్ డేటాను సేకరించారు. కాల్ డేటాలో మై హార్ట్ ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి.16 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు, నిందితుడు ముఖానికి టవల్ కట్టుకోవడం కూడా మరింత అనుమానాలకు తావిచ్చింది. ఇరువురు గంటకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీశారు.

అనుమానంతో రగిలిపోయాడు

అనుమానంతో రగిలిపోయాడు

కాగా, నిందితుడు చూసిన సీరియల్స్‌, బుర్రనిండా క్రైమ్‌ ఆలోచనలు, ఆవేశం కారణంగా అతను దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు. పక్కా ప్లాన్‌తో స్నేహితురాలిని అడ్డు తొలగించేందుకు స్కెచ్ గీశాడు. దానికి బీజం వేసింది మాత్రం చిన్నపాటి అనుమానమే. ఆమెపై అనుమానంతో దూరంగా ఉంచాలని ప్రయత్నించి విఫలమై హతమార్చాడు.

కలిసి బతకలేనప్పుడు, కలిసి చనిపోదామని చెప్పడంతో..

కలిసి బతకలేనప్పుడు, కలిసి చనిపోదామని చెప్పడంతో..

ఇరువురి మధ్య గొడవల నేపథ్యంలో.. హత్య జరిగిన రోజు కలిసి బతకలేనప్పుడు, కలిసి చనిపోదామని చాందిని అనడం అతనిని ఉలిక్కిపాటుకు గురి చేసిందని అంటున్నారు. దీంతో అతను విచక్షణ కోల్పోయాడు. అదే సమయంలో ముందస్తు పథకంలో భాగంగానే ఆమె గొంతు నులిమి చంపేశాడని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandini murder was premeditated: Police
Please Wait while comments are loading...