కూతురు కంటతడి, ఏం కాలేదమ్మా.. రేవంత్: బాబు సహా హాజరు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మధ్యంతర బెయిల్ పైన విడుదలై ఇంటికి చేరుకున్నారు. ఆయన నిశ్చితార్థం వేడుకలో హడావిడిగా ఉన్నారు. నిశ్చితార్థం నిమిత్తం మాదాపుర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాలుకు బయలుదేరారు.
అంతకుముందు ఆయనను చూసి కుమార్తె నైమిషా రెడ్డి బోరున విలపించారు. ఏం కాలేదమ్మా అంటూ రేవంత్ రెడ్డి కుమార్తెను ఊరడించారు. అంతేకాదు, నిశ్చితార్థ వేడుక కోసం అందర్నీ సిద్ధం కావాలని సూచించారు. 11 గంటలకు నిశ్చితార్థం ప్రారంభమైంది.
నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, ఏపీ కేబినెట్ మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, తదితరులు హాజరయ్యరు.

మానసిక ధైర్యం ఇచ్చేందుకు రెండువైపులా...
తన అరెస్టు నేపథ్యంలో కుటుంబానికి, అనుచరులకు మానసిక ధైర్యం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. నిశ్చితార్థ వేడుకల్లో ఆయన నవ్వుతూ కనిపించారు. తెల్లటి టీ షర్ట్‌లో ఇంటికి చేరుకున్న రేవంత్, ఆ తర్వాత సంప్రదాయ దుస్తుల్లో నిశ్చితార్థంలో పాల్గొన్నారు.
మీడియాతో, రాజకీయ నాయకులతో మాట్లాడవద్దని కోర్టు ఆదేశాలు ఉండటంతో ఆయన దూరంగా ఉన్నారు. మరోవైపు, రేవంత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉన్నామని చెప్పేందుకు, మానసిక ధైర్యం ఇచ్చేందుకు టీడీపీ యావత్ కదలివచ్చింది.
మరోవైపు, రేవంత్ రెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో రేవంత్ రెడ్డి పైన ఏసీబీ అధికారులు సివిల్ డ్రెస్‌లో ఫాలో అవుతున్నారు. పోలీసులు కూడా ఉంటున్నారు. ముగ్గురు ఎస్పీ స్థాయి, పదిమంది ఎసీబీ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications