నారా లోకేష్‌పై చంద్రబాబు క్లారిటీ: రేవంత్ రెడ్డికి మిగిలింది నిరాశే
నారా లోకేష్‌పై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఆయన ఆ క్లారిటీ ఇచ్చారు.
విజయవాడ: తన తనయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమైంది. అదే సమయంలో తెలంగాణ టిడిపికి నారా లోకేష్‌ను ఇచ్చేది లేదని కూడా చెప్పేశారు. దీంతో టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నిరాశే మిగిలింది.
లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఆయన తెలంగాణ టీడీపీ నేతలతోవిజయవాడలో సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. లోకేశ్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని వారు చంద్రబాబును కోరారు. అది వీలు కాదని, లోకేశ్‌ను ఏపీలో మంత్రి పదవి అప్పగించాలని అనుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.

ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రాన్ని ఆహ్వానించిన తెలంగాణ ప్రజలకు కొత్తదనమేదీ కనిపించడం లేదని, హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందని టిడిపి తెలంగాణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు టీడీపీ ఎత్తి చూపిన అంశాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కోదండరాం వంటి వారు కూడా ప్రధానంగా ముందుకు తెస్తుండడాన్ని వారు ప్రస్తావించారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాలని, తన సహకారం ఉంటుందని నేతలకు చంద్రబాబు సూచించారు.
ప్రజలతో మమేకమైతేనే ప్రతిపక్షానికి గుర్తింపు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గాల్లో ఈ నెలలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణలోని పార్టీ నేతలకు అందుబాటులో ఉంటానని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications