బాబు ఉంటే స్వాతంత్ర్యం రాకపోయేది, ఏడాది లోపే కూలొచ్చు, గుంటనక్కలు: జగన్
చంద్రబాబు నాయుడు వంటి వారు ఒక్కరు ఉంటే మన దేశానికి స్వాతంత్ర్యమే వచ్చి ఉండేది కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి వారు ఒక్కరు ఉంటే మన దేశానికి స్వాతంత్ర్యమే వచ్చి ఉండేది కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
గురువారం రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఇవాళ్టి ఘటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. కొత్త ఉద్యోగాలు రావాలంటే మనకు ఇచ్చిన హోదా హామీ నెరవేరాల్సిందే అన్నారు. దేవుడు దయ తలిస్తే ఏడాదిలోగానే చంద్రబాబు ప్రభుత్వం కూలుతుందన్నారు.

బాబు వస్తేనే జాబు వస్తుందని గతంలో టిడిపి చెప్పిందని, కానీ బాబు ప్రభుత్వం పోతేనే జాబులు వస్తాయని నేను చెబుతున్నానని జగన్ అన్నారు. తమకు తెలంగాణ ఉద్యమం, జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తి అన్నారు.
పోలీసులు వ్యవహరించిన తీరు అబ్యంతరకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్నారు. మరో రెండేళ్లే ఉంటుందని చెప్పారు. దేవుడు దయ తలిస్తే ఏడాదే ఉంటుందన్నారు. అప్పుడు మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు.
అప్పుడు ఏ కేసు పెట్టినా తీసేస్తామన్నారు. కాబట్టి ఏ పిల్లవాడు భయపడవలసిన అవసరం లేదన్నారు. కేసుల కోసం భయపడవద్దన్నారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందన్నారు. చంద్రబాబు, సుజనా చౌదరిల మాటలు వింటే వీళ్లు మనుషులేనే ఆనిపిస్తోందన్నారు.
గుంటనక్కలకు సెల్యూట్ కొట్టొద్దు
పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది టోపీ మీద ఉండే సింహాలకు కానీ గుంట నక్కలకు కాదన్నారు. చంద్రబాబు సర్కారుకు, ఆయన వద్ద పని చేస్తున్న కొంతమంది పోలీసులకు చెబుతున్నానని.. జీతాలు ఇచ్చేది చంద్రబాబు కాదని, ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు.
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
నేడు చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు జగన్ పిలుపునిచ్చారు.
జగన్‌కు మద్దతుగా తల్లి, భార్య..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గురువారం కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించాలని జగన్ పిలుపునివ్వడంతో ఆయన సతీమణి భారతి, తల్లి విజయమ్మ కూడా స్పందించారు. వారు హైదరాబాదులోని నివాసంలో కొవ్వత్తులు వెలిగించి మద్దతు ప్రకటించారు. హోదా రావాలని, దీని వల్ల ప్రజలందరికీ మేలు జరగాలని వారు ఆకాంక్షించారు.
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications