చంద్రబాబుది పచ్చి మోసం..! మరోసారి మొత్తుకున్న మోత్కుపల్లి..!!
Recommended Video

హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మటుమాయం కావడానికి ఎవరో కారణం కాదని,కేవలం బాబు స్వార్థ రాజకీయాలకోసమే తెలంగణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని ఘాటుగా ఆరోపణలు చేసారు. తెలంగాణలో టీడీపీ పార్టీని భూస్థాపితం చేసిన టీడీపీ నాయకులు చంద్రబాబు ఆంధ్రాలో ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రమూ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం చంద్రబాబునాయుడేనన్నారు.
రాష్ట్రంలో టీడీపీని నమ్ముకుని మిగిలున్న ఒకరిద్దరు నాయకులు ఏమై పోవాలని ప్రశ్నించారు. మాల, మాదిగలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు కాపులకు ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసం, కుట్ర, దగా, వెన్నుపోటు తదితరాలతోనే తెలంగాణ నుంచి టీడీపీ మాయమైందని అన్నారు.

ఒకప్పుడు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న తెలంగాణ, అదే తెలంగాణలో పార్టీకి ఇప్పుడీ పరిస్థితి దాపురిస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. పార్టీ కోసం తన జీవితాన్నే ధారపోశానని, విభజన తరువాత టీడీపీ జాతీయ పార్టీగా ఉంటుందని భావిస్తే, కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు పారిపోయారని ఘేటుగా విమర్శలు గుప్పించారు మోత్కుపల్లి నర్పింహులు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications