రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు: రేవంత్‌పై బాబు ఆసక్తికరం! కచ్చితంగా చెప్తాను

Posted By:
Subscribe to Oneindia Telugu
  కేసీఆర్-చంద్రబాబుల మధ్య రేవంత్ రెడ్డి : రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

  కేసీఆర్‌కు కొత్త చిక్కు: రాజీనామా ఆమోదిస్తే రేవంత్ గట్టి షాకివ్వక తప్పదు?

  ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, నామా నాగేశ్వర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి, ఉమా మాధవ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  అదే చరిత్ర పునరావృతం అవుతోంది.

  అదే చరిత్ర పునరావృతం అవుతోంది.

  ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడారు. గతంలో తెలంగాణలో దొరల పాలన ఉండేదని అన్నారు. ఆ గడీల పాలనకు టీడీపీ చరమగీతం పాడిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోను అదే పునరావృతం అవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆమోదించడం లేదన్నారు.

  కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారింది

  కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారింది

  కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎల్ రమణ కాంగ్రెస్ పార్టీ పైన కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకుందన్నారు. ఆ పార్టీ వల్ల ఏం కాదన్నారు.

  గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టిన టిడిపి

  గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టిన టిడిపి

  ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా టీడీపీ పని చేస్తోందని ఎల్ రమణ తెలిపారు. రాజకీయ ప్రభుత్వాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టిన పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. వ్యక్తిగత రాగద్వేషాలకు టీడీపీలో తావు లేదని చెప్పారు.

  నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని పార్టీ పెట్టలేదు

  నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని పార్టీ పెట్టలేదు

  తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించలేదని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం ఆయన పార్టీని స్థాపించారని తెలిపారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు. ఓ ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్షంగా పని చేసింది కేవలం టీడీపీ మాత్రమే అన్నారు.

  మేం చనిపోయినా ఫర్వాలేదు

  మేం చనిపోయినా ఫర్వాలేదు

  టీడీపీ అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిందని చంద్రబాబు అన్నారు. మేం చనిపోయినా ఫర్వాలేదు, పార్టీ ఉండాలని చాలామంది కోరుకున్నారన్నారు. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్లు అని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.

  హైదరాబాద్ అభివృద్ధి ఇలా

  హైదరాబాద్ అభివృద్ధి ఇలా

  హైదరాబాదులో నాడు నేను చేసిన అభివృద్ధిని ఎవరూ మరిచిపోలేరని, ఎవరూ తుడిచివేయలేరని చంద్రబాబు అన్నారు. నాడు అభివృద్ధి చేస్తుంటే ఓట్లు పోతాయని కొందరు చెప్పారని, కానీ ఓట్లు పోయినా ఫర్వాలేదు, ప్రజలకు అభివృద్ధి కావాలని చెప్పానని అన్నారు. హైదరాబాద్ తర్వాత సైబరాబాద్‌ను నిర్మించింది, ఔటర్ రింగ్ రోడ్డులను నిర్మించింది టీడీపీయే అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వచ్చిందన్నారు. హైదరాబాదులో కర్ఫ్యూ లేకుండా చేశామన్నారు. హైదరాబాదులో మతసామరస్యాన్ని కాపాడింది టీడీపీయే అన్నారు.

  అలా రేవంత్ రెడ్డి ఇష్యూపై పరోక్షంగా

  అలా రేవంత్ రెడ్డి ఇష్యూపై పరోక్షంగా

  తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టిడిపి ఆవిర్భవించిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఆవిర్భవించిన కొత్తలో దెబ్బతీసే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాదేండ్ల భాస్కర రావు విషయాన్ని గుర్తు చేసారు. కానీ తెలుగు ప్రజలు తిప్పికొట్టారన్నారు. తద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా టీడీపీని దెబ్బతీయాలని చూస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

  అందుకే ఇక్కడకు వచ్చా

  అందుకే ఇక్కడకు వచ్చా

  విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాను కేంద్రాన్ని కోరానని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ కార్యకర్తల్లో చైతన్యం నింపేందుకు వచ్చానని చెప్పారు. సుశిక్షుతులైన కార్యకర్తలు పార్టీకి అన్ని వేళల్లా వెన్నుదన్నులా నిలుస్తున్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ రాజకీయానికి కొత్త నిర్వచనం ఇచ్చిందని, అభివృద్ధిని కాంక్షించిందన్నారు.

  రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు

  రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు

  రాజకీయాల్లో కొన్నిసార్లు ఏం చేస్తామో చెప్పకూడదని చంద్రబాబు అన్నారు. అలా చెబితే రాజకీయమే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడితేనే తనకు ఆనందం అన్నారు.

  వీలైనన్ని ఎక్కువసార్లు తెలంగాణకు వస్తా

  వీలైనన్ని ఎక్కువసార్లు తెలంగాణకు వస్తా

  తెలంగాణలో టీడీపీకి కచ్చితమైన భవిష్యత్తు ఉందని నేను గట్టిగా చెప్పగలనని అన్నారు. తమ్ముళ్లు మీ పని మీరు చేసుకోండని, నేను అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణలో పార్టీ పటిష్టం కోసం పని చేద్దామన్నారు. నెలకోసారి సమీక్షలు పెట్టుకుందామన్నారు. వీలైనన్ని ఎక్కువసార్లు ఇక్కడకు వస్తానని చెప్పారు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో ప్రణాళికలు తయారు చేద్దామని చంద్రబాబు చెప్పారు. పని చేసే నాయకుడికి మనం అధికారం ఇద్దామన్నారు.

  ఏపీకి అనేక సమస్యలు వచ్చాయి

  ఏపీకి అనేక సమస్యలు వచ్చాయి

  విభజన అనంతరం ఏపీకి అనేక సమస్యలు వచ్చాయని, సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఎంతో కష్టపడితే కానీ అక్కడి సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu indirectly respond on Revanth Reddy, who joined Congress, in TTDP meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి