రాజీనామాతో బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే, కెసిఆర్‌కు చిక్కులే

Posted By:
Subscribe to Oneindia Telugu
బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే | Oneindia Telugu

హైదరాబాద్:తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే విషయమై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం నాడు పార్టీ నేతలతో చర్చించనున్నారు. రేవంత్‌తో పాటు కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యంలో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబు చర్చించనున్నారు.దీంతో పాటుగా రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాపై ఏం చేయాలనే దానిపై కూడ పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.

టిఆర్ఎస్‌కు విజయరమణరావు షాక్: హమీ ఇచ్చినా కాంగ్రెస్‌లోకి, కారణమదేనా?

అక్టోబర్ 31వ, తేదిన కీలక నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి టిడిపిని పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామం టిడిపికి తీవ్ర నష్టాన్ని కల్గిస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యకు టిడిపి పూనుకొంది.

రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?

తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్‌లో ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడ పార్టీ నేతలతో బాబు చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

రేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లు

మరో వైపు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకర్గాల ఇంచార్జీల ఖాళీలను భర్తీ చేయనున్నారు. కొత్త నాయకత్వాన్ని పార్టీలోకి వచ్చేలా చేయాలని ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు తమకు అనుకూలంగా వినియోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది టిడిపికి ఇబ్బందికర పరిణామంగానే కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.

రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఏం చేస్తారు

రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఏం చేస్తారు

పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడ రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డి పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడుకు అందించారు. అయితే ఈ రాజీనామా లేఖపై ఏం చేయాలనే దానిపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.రేవంత్ రెడ్డి తమకిచ్చిన రాజీనామా లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలా? వద్దా? అన్న విషయంలోనూ చర్చ సాగనుంది. ఈ వ్యవహరం ఏపీలో రాజకీయంగా టిడిపికి ఇబ్బంది కల్గించే అవకాశం లేకపోలేదు. దరిమిలా వ్యహత్మకంగా వ్యవహరించనుంది టిడిపి.రేవంత్ స్వయంగా మరో లేఖను తీసుకెళ్లి స్పీకర్ కు ఇచ్చే పరిస్థితిని తీసుకురావాలని టిడిపి నాయకత్వం ఆలోచనగా కన్పిస్తోంది.

రేవంత్ రాజీనామా లేఖ బాబుకు ఇబ్బందేనా?

రేవంత్ రాజీనామా లేఖ బాబుకు ఇబ్బందేనా?

రేవంత్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను బాబుకు అందించారు. అయితే ఈ లేఖను బాబు ఇంకా స్పీకర్‌కు పంపలేదు. ఈ లేఖను తెలంగాణ స్పీకర్‌కు పంపితే రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారు. అయితే స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ ఉన్నందున ఈ లేఖపై రేవంత్‌తో చర్చించిన మీదట స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సంప్రదాయం. ఒకవేళ రేవంత్‌ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపి రాజీనామా ఆమోదం పొందితే ఏపీలో కూడ పార్టీ ఫిరాయించి మంత్రులుగా ఉన్నవారితో పాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలపై నిర్ణయం అంశం మరోసారి తెరమీదికి రానుంది. ఇదే అంశాన్ని తీసుకొని వైసీపీ అసెంబ్లీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాలు రాజకీయంగా ఏపీలో టిడిపికి ఇబ్బందిని కల్గిస్తాయి.

టిఆర్ఎస్‌కు ఇబ్బందులేనా?

టిఆర్ఎస్‌కు ఇబ్బందులేనా?

తెలంగాణ అసెంబ్లీలో కూడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కూడ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. కోర్టుల్లో కేసులు కూడ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి స్వయంగా పార్టీ ఫిరాయించిన టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని కోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌కు కూడ పలుమార్లు కోరారు. అయితే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. రేవంత్‌రెడ్డి రాజీనామాను చంద్రబాబునాయుడు తెలంగాణ స్పీకర్‌కు పంపితే ఈ రాజీనామాను ఆమోదిస్తే... గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందుకొన్న ఎమ్మెల్యేలపై చర్యల అంశం తెలంగాణలో కూడ తెర మీదికి రానంది. అయితే టిడిపి ఎమ్మెల్యేలు కొందరు తమ శాసన.సభపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేసినట్టు గతంలోనే స్పీకర్‌కు లేఖ సమర్పించారు. అయితే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీలకు రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ఇబ్బందికల్గించే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొడంగల్ ఉప ఎన్నిక జరిగేనా?

కొడంగల్ ఉప ఎన్నిక జరిగేనా?


కొడంగల్ ఉప ఎన్నిక జరుగుతోందా... లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయానికి చేరితే ఉప ఎన్నికకు టిఆర్ఎస్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొంటుంది. కానీ, కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం కొడంగల్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుదవారం నాడు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu Naidu may discuss with party leaders on Revanth Reddy resignation issue.Chandrababu naidu will meeting with TTDP leaders on thursday at Hyderabad.
Please Wait while comments are loading...