ఏపీకి రావాల్సిన 2,500 కోట్లు కేసీఆర్ సర్కార్ నుంచి వసూలు చేయండి: చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మరోసారి పరోక్షంగా తలపడనున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రేదశ్‌లో నగరంలోని విద్యుత్ సంస్ధల విభజన తర్వాత తెలంగాణ సర్కార్ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ ఆదేశాలతో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఏపీకి చెందిన విద్యుత్ సంస్ధలకు చెందిన రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Chandrababu naidu orders employees to bring money back to telangana govt

బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రాబబుని కలిసి విన్నవించగా, ఆయన స్పందించారు. ఆస్తుల విభజన కూడా ఉద్యోగుల విభజన జరిగిన నిష్పత్తిలోనే జరిగేలా చూడాలని సూచించారు.

మరోవైపు ఆస్తుల విభజనకు సంబంధించి ఓ సంయుక్త కమిటీని నియమించాల్సి ఉందని కూడా విద్యుత్ సంఘం ఉద్యోగులు సూచించారు. వారితో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉద్యోగులు, ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

కాగా ఇటీవలే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వమే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+