హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.16 ఉండాల్సిన మెట్రో టిక్కెట్ రూ.60కి పెరిగింది, అందులో కేసీఆర్ ఒకరు: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వల్లే హైదరాబాద్ ఆధునిక నగరంగా తయారయిందని చెప్పారు. కేసీఆర్‌కు మాట్లాడితే ఫాంహౌస్ ఒక్కటే గుర్తుకు వస్తుందని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్నికాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

<strong>చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్‌లో రంగంలోకి జనసేన, వైసీపీ!</strong>చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్‌లో రంగంలోకి జనసేన, వైసీపీ!

హైదరాబాదుకు కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. పేదవారి కోసం కూటమి ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో రోడ్ షోలో మాట్లాడారు.

 నేను పెంచి పోషించిన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు

నేను పెంచి పోషించిన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు

జాతీయస్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తామని,కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పారు. సీనియర్ నేతగా దేశంలో పరిస్థితిని గాఢిన పెట్టవలసిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానని చెప్పారు. నేను పెంచి పోషించిన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ కోసం తాను విజన్ తయారు చేశానని చెప్పారు. కులీకుతుబ్ షా హైదరాబాద్ కడితే, నేను సైబరాబాద్ కట్టానని చెప్పారు. కేసీఆర్‌కు మాట్లాడితే ఫాంహౌస్ ఒక్కటే గుర్తుకు వస్తుందన్నారు. ట్యాంక్‌బండ్, బుద్ధపూర్ణిమను ఎన్టీఆఱ్ ఏర్పాటు చేశారని చెప్పారు.

 దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు

దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు

చంద్రబాబు హైదరాబాదులో వరుసగా రోడ్డు షోలలో, సభల్లో పాల్గొంటూ కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు తెలంగాణ పాలనలో జోక్యం చేసుకునేందుకే ఇక్కడకు వస్తున్నారని, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చక్రం తిప్పుతారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

 కేసీఆర్ చిచ్చుపెడుతున్నారు

కేసీఆర్ చిచ్చుపెడుతున్నారు

రాజకీయ మనుగడ కోసం కేసీఆర్‌ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని, తాను తెలంగాణలో సీఎంను కాలేనని, ఏపీలో చేయాల్సిన పని ఎంతో ఉందని, కానీ తెలంగాణ ప్రజల అభిమానిని అని, హైదరాబాద్‌ ఇంకా అభివృద్ధి చెందితే సంతోషించే వారిలో తానే మొదటి వాడిని అని, కేసీఆర్‌ వల్ల హైదరాబాద్‌ పాడైపోయిందని, నేను సీఎంగా హైదరాబాద్‌లో ఎన్నోసార్లు తిరిగానని, ఆయన ఎప్పుడైనా సచివాలయానికి వచ్చారా అని చంద్రబాబు మండిపడుతున్నారు. తనను ఎన్నిసార్లు తిట్టినా పట్టించుకోనని, తెలుగువారి వృద్ధిని కాంక్షిస్తానని చెప్పారు.

 రూ.16 ఉండాల్సిన మెట్రో టిక్కెట్ రూ.60కు పెరిగింది

రూ.16 ఉండాల్సిన మెట్రో టిక్కెట్ రూ.60కు పెరిగింది

దేశం బాగుపడాలంటే అక్కడ సీనియర్‌ మోడీ, ఇక్కడ జూనియర్‌ మోడీ ఓడిపోవాలని, జూనియర్‌ మోడీని సపోర్టు చేసే అసదుద్దీన్‌ కంగుతినాలని చంద్రబాబు అన్నారు. నాలుగు భవనాలు కడితే సరిపోయిందా అని అని కేటీఆర్‌ అంటున్నారని, తాను ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నానని, ఎవరి హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందో చెప్పాలని అన్నారు. మెట్రో ప్రాజెక్టు కాలయాపన వల్ల వ్యయం పెరిగిందిన్నారు. ప్రజలపై భారం పడిందని చెప్పారు. రూ.16 ఉండాల్సిన టికెట్‌ రూ.60లకు పెరిగిందని చెప్పారు.

English summary
Andhra Pradesh Chief Minister and TDP national president Nara Chandrababu Naidu's road show in Film Nagar. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X