7న వరంగల్‌కు చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు ములుగు మాజీ ఎమ్మెల్యే తెలుగు దేశం నాయకురాలు సీతక్క కుమారుని వివాహానికి వస్తున్నారు.
వరంగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 7న శుక్రవారం రోజున వరంగల్ పట్టణానికి విచ్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొదిటి సారిగా చంద్రబాబు నాయుడు వరంగల్‌కు విచ్చేయడం విశేషం.
చంద్రబాబు నాయుడు ములుగు మాజీ ఎమ్మెల్యే తెలుగు దేశం నాయకురాలు సీతక్క కుమారుని వివాహానికి వస్తున్నారు. చంద్రబాబునాయుడు హెలీకాప్టర్ ద్వారా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో దిగి ఆ తర్వాత కారులో హంటర్ రోడ్డులో గల విష్ణుప్రియ గార్డెన్‌లో సీతక్క కుమారుని వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి తిరిగి వెళ్తారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు వివాహ ముహూర్తం ఉంది. 9 గంటలకు సరిగ్గా విష్ణుప్రియ గార్డెన్‌కు వస్తారని తెలుగు దేశం నాయకులు తెలిపారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications