Chandrababu-Revanth Reddy Meet: చంద్రబాబు-రేవంత్ భేటీలో పాల్గొనే మంత్రులు, అధికారులు వీరే..!
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ జరుగుతోంది. ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వీరిద్దరూ అధికారిక హోదాలో భేటీ అవుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు, సంస్థల విభజన, బకాయిల చెల్లింపులు.. ఇలా చాలా అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అయితే ఈ భేటీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో ఇవాళ పాల్గొంటున్న మంత్రుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఉన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరిలో ముందుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, మరో ఇద్దరు అధికారులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఐఏఎస్ లు కార్తికేయ మిశ్రా, ముద్దాడ రవిచంద్ర ఉన్నారు.

వీరంతా గత పదేళ్లుగా ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై జరిగిన భేటీల్లో పాల్గొన్న వారే ఉన్నారు. ముఖ్యంగా అధికారుల స్ధాయిలో దాదాపు 30 సమావేశాయి. ఇందులో పాల్గొన్న అధికారులతో పాటు కొత్త అధికారులు కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. వీరంతా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఈ సమావేశంలో తగిన సూచనలు, సలహాలు అందించబోతున్నారు. విభజన అంశాలపై పూర్తి సమాచారంతో వీరు హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications