కెసిఆర్‌తో మీ పరపతి పెరిగింది: బాబుతో టి-టిడిపి, సుధారాణిపై ఆరా
విజయవాడ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడంతో తెలంగాణలో మీ పరపతి పెరిగిందని తెలంగాణ టిడిపి నేతలు ఏపీ సీఎం, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వ్యాఖ్యానించారు.
కెసిఆర్‌ను మీరు స్వయంగా ఆహ్వానించారని, దీంతో తెలంగాణలోనే కాకుండా మొత్తంగా మీ పరపతి పెరిగిందని చెప్పారు. అమరావతి శంకుస్థాపన పైన ప్రజల్లో, పార్టీలో సానుకూల స్పందన ఉందని వారు చంద్రబాబుతో చెప్పారు.

తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు గట్టి సూచనలు
తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు గట్టి సూచనలు చేశారు. అందరు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టువిడుపులు వీడాలని హితవు పలికారు.
ప్రజలలో గౌరవం పెరిగేలా నేతలు ప్రవర్తించాలని చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేయాలన్నారు. కాగా, చంద్రబాబు రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి విషయమై ఆరా తీశారు. ఆమె పార్టీ వీడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications