'చంద్రబాబు పసుపు తెలంగాణకు అమంగళం'
హైదరాబాద్: తెలంగాణకు చంద్రబాబు పసుపు అమంగళమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ విలేకరి.. పసుపురంగు టీ షర్ట్‌లో ఉన్నారు. దీనిని గమనించిన కేటీఆర్.. పసుపు అంటే మీకు ఇష్టమెందుకని, మీరు పని చేసే సంస్థ యజమానికి ఆ రంగు పడదన్నారు. చంద్రబాబు పసుపు తెలంగాణకు అమంగళమన్నారు.
అంగన్వాడీ కార్యకర్తల చలో అసెంబ్లీ కార్యక్రమంపై మాట్లాడుతూ.. హైదరాబాదులో చంద్రబాబు నాయుడు అతిథిగా పాలన చేస్తున్నారని, ఇప్పుడు తాము చలో అసెంబ్లీని భగ్నం చేయకుంటే తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో విఫలమైందని ఆరోపిస్తారని, అందుకే రక్షణ ఏర్పాట్లు చేశామన్నారు.
శాసన సభతో పాటు మదీనాగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌కు భద్రత సిబ్బంది, వారికి భోజన, వసతులు తామే ఇస్తున్నామన్నారు. అంగన్వాడీల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ శాసన సభ సమావేశాలు
బుధవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. కాగా, హైకోర్టు ఏర్పాటు పైన తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
మద్యం సిండికేటర్ అసెంబ్లీలోకి వచ్చారని రగడ
మద్యం సిండికేటును అసెంబ్లీలోకి తీసుకు వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ అధికార పార్టీపై మండిపడ్డారు. తెరాస ఎమ్మెల్యేలే మద్యం సిండికేటును తీసుకు వచ్చారన్నారు. మద్యం సిండికేటును అసెంబ్లీకి తీసుకు వచ్చినట్లు నిరూపించగలరా తెరాస ఎదురు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications