పక్క దేశపు పార్టీ, వారిలాగే: బాబుకు కేటీఆర్ నిలదీత

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు పర్యటనను తాము కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల పర్యటనల్లా చూస్తామని చెప్పారు.

చంద్రబాబు తెలంగాణ వాటాను తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ లోటు బడ్జెట్‌లో ఉందని చెబుతూనే రూ.15 కోట్లతో చాంబర్‌కు మరమ్మతు చేయించారని విమర్శించారు. తెలంగాణలో కరెంట్, నీటి వాటాలు ఇచ్చాకనే చంద్రబాబు పర్యటనకు రావాలని సూచించారు.

చంద్రబాబు వరంగల్ పర్యటనకు రాకముందే తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఇవ్వాలన్నారు. తెలంగాణ వాటాను తరలించుకుపోతున్న చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. చంద్రబాబు తన పార్టీ పేరును పక్క దేశపు పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

Chandrababu should change TDP name as Pakka Desapu Party

ఎనుమామల మార్కెట్‌లో టీటీడీపీ నేతల పర్యటన

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌ యార్డును బుధవారం ఉదయం సందర్శించారు. నేతల ఎర్రబెల్లి దయాకర రావు, వేం నరేందర్‌రెడ్డి మార్కెట్‌లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఎర్రబెల్లి, ఎంపీలు గరికపాటి మోహన్ రావు, సుధారాణిలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం ఉదయం ఎనుమాముల మార్కెట్‌యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. పత్తికి రూ. 5వేలు, మిర్చికి రూ.10వేల రూపాయలు మద్ధతు ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+