హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ లాంటి ఘటనలపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు, సమాజంలో మార్పు రావాలట...

|
Google Oneindia TeluguNews

దిశ లైంగికదాడి, హత్య.. ఇతర ఘటనలపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యకు మూలాలు కనుక్కొవాలని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. సమస్యకు చంపడం పరిష్కారం కాదని కామెంట్ చేశారు. దిశ, ఉన్నావ్ లాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతోన్న సమయంలో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్‌కౌంటర్..

ఎన్‌కౌంటర్..

దిశపై లైంగికదాడి చేసి, హతమార్చిన నలుగురు కీచకులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను గత శుక్రవారం పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది. పోలీసులపై దాడికి యత్నించడంతో కాల్పులు జరపడం తప్ప మరో మార్గం లేదని అధికారులు వివరించారు. దీనిపై దేశవ్యాప్తంగా స్వరత్రా హర్షం వ్యక్తమైంది. కానీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు మాత్రం కొన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

చంపడం కాదు..

చంపడం కాదు..

నిందితులను ఉరితీయడం, హతమార్చడం సమస్యకు కారణం కాదని మంత్రి ఈటల రాజేందర్ సెలవిచ్చారు. అదీ తాత్కాలిక పరిష్కారమేనని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి సమాజంలో మార్పురావాలి అని ఈటల సూచించారు. నేరం జరిగితే చట్టం, న్యాయం అని ఊరుకోబట్టే ఏళ్లకు ఏళ్లు నిందితులు జైళ్లోనే ఉంటున్నారు. ఎన్నాళ్లకో వారికి ఉరి శిక్ష అమలు చేస్తున్నారు. నిందితులకు తక్షణమే శిక్ష పడాలని సమాజం కోరుకుంటుంది. కానీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం సమాజంలో మార్పు రావాలని ఉచిత సలహా ఇస్తున్నారు.

మరికొన్ని ఘటనలు..

మరికొన్ని ఘటనలు..

దిశపై లైంగికదాడి తర్వాత సమత, మానసపై జరిగిన ఘాతుకంపై పౌరసమాజం స్పందిస్తోంది. నిందితులకు కఠినశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఉన్నావ్ ఘటనలపై కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు, పౌర సంఘాలు స్పందిస్తున్నాయి. కానీ బాధ్యతాయుతమైన మంత్రి పదవీలో ఉన్న ఈటల రాజేందర్ సమాజంలో మార్పు రావాలని చెప్పి హితోపదేశం చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

తగ్గుతున్న ప్రాధాన్యం

తగ్గుతున్న ప్రాధాన్యం

ఈటల రాజేందర్.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కమలాపూర్, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందుతూ వస్తున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థికమంత్రిగా పనిచేశారు. రెండో విడత ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌ను సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఇక అప్పటినుంచి గులాబీ దళపతి, యువరాజుపై ఈటల రాజేందర్ తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లైంగికదాడి నిందితుల గురించి కామెంట్ చేశారు.

English summary
Change in society not encounter minister etala rejendar on disha issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X