తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమయాల్లో మార్పు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమయాల్లో మార్పు చోటు చేసుకుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగాల్సిన ఈ పరీక్ష సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మార్పు చేసింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే నిర్వహించనుంది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ సమయాన్ని తాజాగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మార్పు చేసింది టీజీపీఎస్సీ.

563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది.అనంతరం మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అయితే, గత నెలలో విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల్లో 31 వేల మందికిపైగా అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
హెచ్ఏఎల్‌లో 324 అప్రెంటీస్ పోస్టులు
మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ 324 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు
విభాగాలు : ఫిట్టర్ -138, టూల్ అండ్ డై మేకర్ -10, టర్నర్ - 20, మెషినిస్ట్ -17, ఎలక్ట్రీషియన్ -27, మోటార్ వెహికల్ మెకానిక్ -6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -8, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 6, పెయింటర్ - 7, కార్పెంటర్ - 6, షీట్ మెటల్ వర్కర్ - 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -50, వెల్డర్ -10, స్టెనోగ్రాఫర్ -3.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
జనరల్ కేటగిరి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు ఉండాలి . అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 30 ఏళ్లు; అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 32 ఏళ్ల వయోపరిమితి వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను పదోతరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్:
అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.7700; రెండో సంవత్సరం నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము: ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 8
దరఖాస్తు చివరి తేదీ : 2024 ఆగస్టు 31
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు : 2024 సెప్టెంబర్ రెండు/ మూడో వారం
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 2024 సెప్టెంబర్ నాలుగో వారం
జాయినింగ్ తేదీ : 2024 అక్టోబర్ రెండో వారం.












Click it and Unblock the Notifications