CM Revanth Reddy: హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్..!
ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ స్క్వాబ్ భారతదేశంలో తన మొదటి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు. డల్లాస్‌లోని చార్లెస్ స్క్వాబ్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, సీనియర్ స్క్వాబ్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా చర్చించారు. చివరగా ఇండియాలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్‌లో తమ చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టడంపై ష్వాబ్ కార్యనిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. హైదరాబాద్‌లో స్క్వాబ్ టెక్నాలజీ సెంటర్‌ను అధికారికంగా ఏర్పాటు చేయడానికి చార్లెస్ స్క్వాబ్ భారతదేశానికి ఒక బృందాన్ని పంపనుంది.

తుది ఆమోదం తర్వాత టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బిజీగా గడుపుతున్నారు. టెక్సాస్‌లోని డల్లాస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి నివాళులర్పించారు. పెట్టుబడుల సమీకరణ కోసం తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రస్తుతం వారం రోజుల అమెరికా పర్యటనలో ఉంది.
న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లలోని వివిధ కంపెనీల ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత, ప్రతినిధి బృందం డల్లాస్‌కు చేరుకుంది.
వాషింగ్టన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. గంటపాటు జరిగిన సమావేశంలో, ప్రతి ప్రాంతంలోని ఆచరణీయ ప్రాజెక్టులను యాక్సిలరేటెడ్ మోడ్‌లో రూపొందించడానికి క్రాస్-ఫంక్షనల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications