వందల కోట్లకు టోకరా: కళానికేతన్ ఎండి సహా భార్య అరెస్టు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న కళానికేతన్ షాపింగ్ మాల్స్ ఎండీపై శనివారం సీసీఎస్‌లో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏవీఎన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద కళానికేతన్ ఎండీ లీలా కుమార్ సుమారు రూ. 3 కోట్లు డబ్బు తీసుకొని ఎగ్గొట్టినట్లుగా తెలుస్తోంది. కళానికేతన్ చైర్మన్‌గా చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినట్లు చెబుతున్నాీరు.
ఈ క్రమంలో ఏవీఎన్ రెడ్డి కళానికేతన్ ఎండీ లీలా కుమార్‌పై 10 రోజుల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం కళానికేతన్ ఎండీ లీలాకుమార్‌తో పాటు ఆయన భార్య శారదను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గతంలోనూ లీలాకుమార్‌పై రుణం తీసుకుని ఎగ్గొట్టారని అభియోగాలు ఉన్నాయని సీసీఎస్ అదనపు డీసీపీ విజయేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఏపీలో 8 బ్యాంకులకు రూ.70 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో 5 బ్యాంకులు, విజయవాడలో 2 బ్యాంకులు, గుంటూరులో 1 బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఒకే భూమికి చెందిన ఫోర్జరీ పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు.
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకులో ఆస్తులు తనఖా పెట్టినట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రిజర్వ్‌బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే పలు బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో లీలా కుమార్ ఉన్నారు. రూ. 800 కోట్లకు పైగా బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకొని ముంచేసినట్లు సమాచారం. తాజా సంఘటనతో కళానికేతన్ ఎండీ లీలాకుమార్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
కళానికేతన్ ఎండీ లీలాకుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాది గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏవీఎన్ రెడ్డి, లీలాకుమార్ కేసు కోర్టులో ఉందని తెలిపారు. కళానికేతన్ గ్రూప్‌కు చెందిన రెండు బృందావన్ సిల్క్స్ షోరూమ్‌లను ఏవీఎన్ రెడ్డి కబ్జా చేసుకొని నిర్వహిస్తున్నారని గీత చెప్పారు.
పాతబస్తీలో నకిలీ డాల్డా గుట్టురట్టు
పాతబస్తీలో జరుగుతున్న కల్తీ ఆయిల్ గుట్టును పోలీసులు ఛేదించారు. కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న గోదాంపై భవానీనగర్ పోలీసులు దాడి చేసి 40 టిన్నుల నకిలీ డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో నగర శివారులో గల పలు గోదాంలపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి నకిలీ నూడుల్స్, నకిలీ కారం, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో స్వప్న(32) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడేందుకు వెళ్లిన భర్త వెంకట్ కూడా మంటల్లో చిక్కుకున్నారు. దీంతో దంపతులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో గాయపడిన వారిద్దరికి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్వప్న పరిస్థితి విషమంగా ఉంది. భర్త వెంకటేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో పలుమార్లు హెచ్చరించింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications