Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా బీజేపీలో వారికి చెక్.. కాషాయదండు ప్రక్షాళన దిశగా బండి సంజయ్ అడుగులు!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్న బిజెపి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని జాతీయ నేతలు చేసిన సూచనలతో బండి సంజయ్ సారథ్యంలో రాష్ట్ర బిజెపి నాయకత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మొక్కుబడిగా పనిచేస్తున్న వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి బిజెపి కసరత్తు చేస్తోంది.

మొక్కుబడిగా పని చేసేవారికి చెక్.. అంకిత భావంతో పని చేస్తేనే ఛాన్స్

మొక్కుబడిగా పని చేసేవారికి చెక్.. అంకిత భావంతో పని చేస్తేనే ఛాన్స్

ప్రస్తుత అవసరాల దృష్ట్యా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలని, మొక్కుబడిగా పనిచేసే వారి స్థానంలో అంకితభావంతో పనిచేసే వారిని నియమించాలని బండి సంజయ్ బృందం యోచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో పార్టీని పునర్వ్యవస్థీకరణ చేయాలని దృష్టి పెడుతున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం బీజేపీలో అనేక పదవులలోమొక్కుబడిగా పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టి పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారిని ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

రాష్ట్ర పదాధికారులు మొదలు జిల్లా అధ్యక్షుల వరకు మార్పులు, చేర్పులు

రాష్ట్ర పదాధికారులు మొదలు జిల్లా అధ్యక్షుల వరకు మార్పులు, చేర్పులు

ఈ క్రమంలోనే రాష్ట్ర పదాధికారులు మొదలుకొని రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు ఇలా అన్ని స్థాయిలలో కొత్త మార్పులు చేయాలని బండి సంజయ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ నియామవళి ప్రకారం మొత్తం 38 జిల్లాలుగా రాష్ట్ర పార్టీ విభజనను చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గత రెండు సంవత్సరాలలో పార్టీ కోసం పని చేసిన నాయకులు ఏ మేరకు పార్టీ కోసం కృషి చేశారు? వారి పనితీరు ఏ విధంగా ఉంది? వారికి అప్పగించిన బాధ్యతలను ఏమేరకు నిర్వహించారు? ప్రజాక్షేత్రంలోకి పార్టీని తీసుకెళ్లడంలో ఎంత మేర సక్సెస్ అయ్యారు? వారు సాధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేయనున్నారు అని తెలుస్తుంది.

రాష్ట్ర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు పార్టీ ప్రక్షాళన

రాష్ట్ర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు పార్టీ ప్రక్షాళన


బండి సంజయ్ బిజెపి రథసారథి గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన సూచనలతో చేసిన ఆందోళనలు, ప్రజా సంకల్ప యాత్రకు వారి నుండి అందిన సహకారం, అనేక పార్టీ కార్యక్రమాలలో వారి పాత్ర, బహిరంగ సభలకు వారు చేసిన జనసమీకరణ వంటి అనేక అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా, గ్రామీణ స్థాయి వరకు టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా సత్తా ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ భావిస్తున్నట్లుగా సమాచారం.

సంస్థాగతంగా మార్పులు చెయ్యటానికి కసరత్తు చేస్తున్న బండి సంజయ్ టీమ్

సంస్థాగతంగా మార్పులు చెయ్యటానికి కసరత్తు చేస్తున్న బండి సంజయ్ టీమ్

పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పనితీరు, వివిధ మోర్చాల కార్యాచరణను ఇటీవల కేంద్రమంత్రులు, జాతీయ నేతలు అధ్యయనం చేసి చేసిన సూచనల మేరకు పార్టీ ప్రక్షాళనకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీ పనితీరుపై అధ్యయనం చేసి నేతలు అందించిన నివేదికల మేరకు పార్టీని బలోపేతం చేయడంపై, సంస్థాగతంగా మార్పులుచేర్పులు చేయడంపై, బిజెపి అధినాయకత్వం ఫోకస్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి పార్టీలో చోటుచేసుకునే సంస్థాగత మార్పులు, పార్టీకి లాభం చేకూరుస్తాయా? లేక నష్టం చేస్తాయా? అనేది భవిష్యత్తులో తేలనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+