హైటెక్ మాస్ కాపీయింగ్: ట్రైనీ ఐపీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ట్రైనీ ఐపీఎస్‌ సఫీర్‌ కరీం హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ కేసులో మరికొన్ని షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొచ్చి, తిరువనంతపురం, హైదరాబాద్‌లలోని కోచింగ్‌ కేంద్రాల్లో చాలా కాలం నుంచే ఇలాంటి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

1.5కి.మీల పరిధిలో పనిచేసే వైర్‍లెస్ మోడమ్స్..

1.5కి.మీల పరిధిలో పనిచేసే వైర్‍లెస్ మోడమ్స్..

యూపీఎస్సీ విద్యార్థులతో మాస్‌కాపీయింగ్‌కు తన వద్దనున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్లూటూత్‌, మీనియేచర్‌ కెమెరాలను ఉపయోగించినట్లు నిర్థారణకు వచ్చారు. మాస్‌ కాపీయింగ్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలోపు పనిచేసే వైర్‌లెస్‌ మోడమ్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు.

భారీగా వసూళ్లు.. గూగుల్ డ్రైవ్ తనిఖీ..

భారీగా వసూళ్లు.. గూగుల్ డ్రైవ్ తనిఖీ..

ప్రస్తుతం కరీం గూగుల్‌ డ్రైవ్‌ అకౌంట్‌ను చెన్నై పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, అతడు రాసిన గత ప్రవేశ పరీక్షల వివరాలూ సేకరిస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం విద్యార్థుల నుంచి కరీం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు.

అండర్‌ వేర్‌లో ఫోన్‌: కీచైన్-కెమెరాకు లింకు!, సఫీర్ ఎంత తెలివిగా కాపీ కొట్టాడంటే..

ఇప్పటికే అరెస్టైన నిందిత దంపతులు..

ఇప్పటికే అరెస్టైన నిందిత దంపతులు..

ఇప్పటికే కరీంతో పాటు అతడి భార్య జాయ్‌సీ జాయ్‌, హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్‌ సెంటర్‌ ఇంచార్జీ పి రాంబాబును ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వీరి నుంచి 11 సెల్‌ఫోన్‌లు, ఒక ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌, నాలుగు హార్డ్‌ డిస్క్‌లు, ఒక పెన్‌ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైలాపూర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు.

రెండు వారాల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్

రెండు వారాల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్

మరో రెండు వారాల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. కాగా, కుమార్తెను చూసుకునేందుకు బెయిల్‌ మంజూరు చేయాలని కరీం భార్య జాయ్‌సీ జాయ్‌ విజ్ఞప్తితో న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, ఇటీవల సంచలనంగా మారిన ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
chennai police speed up enquiry on trainee ips officer high tech mass copying.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి