Chevella Lok Sabha Election 2024 Results LIVE: చేవెళ్లలో గెలుపెవరిది - వారి మద్దతే కీలకం..!!
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు నెలకొంది. మూడు పార్టీలకు మెజార్టీ సీట్లు సాధించమటే లక్ష్యంగా పోరాటం చేసాయి. పలు స్థానాల్లో ఎవరికి వారు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మంగా మారింది. పోలింగ్ సరళి తరువాత ఇక్కడ మూడు పార్టీలకు మరింత అంచనాలు మొదలయ్యాయి. దీంతో,తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
చేవెళ్లలో హోరా హోరీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని మూడు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ ఒకసారి దక్కించుకోగా, బీఆర్ఎస్ రెండుసార్లు సొంతం చేసుకుంది. కమలం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. కానీ ఈసారి ఆయా పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతూ కోటీశ్వరులైన అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు.

డిసైడింగ్ ఫ్యాక్టర్
కాంగ్రెస్ లక్ష మెజార్టీతో గెలుస్తామని భావిస్తుండగా గత ఎన్నికలతో పోల్చితే 3 లక్షలపైనే తనకు మెజార్టీ రావచ్చని బీజేపీ అభ్యర్థి కొండా ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం మెజార్టీ లెక్కలు పక్కనపెడితే సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోమని, మూడోసారి కూడా గెలిచి చూపిస్తామని ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. వీరికి తోడు మరో 40 మంది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల మిళితంగా ఉండే చేవెళ్ల లోక్‌సభలో గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లిలో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఈ ఎన్నికల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ఫలితం పై ఉత్కంఠ
చేవెళ్ల లోక్‌సభ గెలుపు ఓటములను యువ ఓటర్లే నిర్ణయించబోతున్నారు. పెరిగిన ఓట్లలో 52 శాతం ఓట్లు యువత వాటాగా ఉంది. మొత్తం 7 ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 ఏళ్లలోపు 15 లక్షల 20 వేల 890 మంది యువ ఓటర్లున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు వారిపైనే ఆశలు పెట్టుకున్నాయి. యువత పెద్దసంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనటంతో తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇదే సమయంలో స్థానిక సమీకరణాలతో గెలుపు ఖాయమని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. దీంతో..అసలు గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications