వినియోగదారుడికి చికెన్ ఇచ్చిరాలేదని చంపేశాడు
వరంగల్: ఓ వినియోగదారుడికి చికెన్ ఇచ్చిరానందుకు పక్క దుకాణంలోని కూలీని చికెన్‌షాపు యజమాని చంపేశాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని రంగంపేటలో నజీర్‌పాషా చికెన్‌సెంటర్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఓ కస్టమర్ తన ఇంటికి చికెన్ పంపించాలని చికెన్‌సెంటర్ యజమానికి నజీర్‌కు చెప్పి వెళ్లిపోయాడు.
పక్కనే టెంట్‌హౌజ్‌లో పనిచేస్తున్న ఎండీ జమీల్(28)ను చికెన్ ఇచ్చి రావాలని నజీర్ కోరగా, అతను నిరాకరించాడు. ఆగ్రహించిన నజీర్‌పాషా కోపంతో కత్తితో జమీల్ కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జమీల్‌ను హైదరాబాద్ తరలిస్తుండగా మృతిచెందాడు.
జమీల్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురున్నారు. నజీర్‌పాషాను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరామయ్య తెలిపారు.

సింగరేణి కార్మికుడి మృతి
గనిలో విధులు ముగించుకుని ఉపరితలానికి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గనిలో ఈర్ల రామ్మూర్తి (44) జనరల్‌మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
శుక్రవారం విధులు ముగించుకుని తిరిగివస్తుండగా 1వ సీం, 19వ లెవల్, 29వ డిప్ వద్ద అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. కార్మికులు ఉపరితలానికి తీసుకొస్తుండగానే తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications