భుజంపై చేయి వేసి ఆప్యాయంగా కేసీఆర్(ఫోటోలు)
హైదరాబాద్: మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో తన వద్ద పనిచేసే సిబ్బంది, ఉద్యోగులతో ఆప్యాయంగా గడిపారు. ఎలా ఉన్నారు? ఏమైనా ఇబ్బందులున్నాయా? అంటూ సాక్షాత్తు సీఎం తమ భుజాలపై చేతులువేసి ఫొటోలు దిగుతుంటే ఆ ఉద్యోగులందరూ ఎంతో సంతోషించారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ముగిసిన వెంటనే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, తన కార్యాలయంలోని సిబ్బంది, ఉద్యోగులను పలకరించారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అందరినీ పిలిచి మాట్లాడారు. సీఎం ముఖ్య భద్రతాధికారి (సీఎస్‌వో) నరేందర్‌సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని సీఎంకు పరిచయం చేశారు.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
సాధారణ ఉద్యోగాలు చేసుకునే సామాన్యులతో సాక్షాత్తు సీఎం సామాన్యుడిగా మారిపోయి ఆత్మీయంగా పలకరించడం గమనార్హం. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందితో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
పలువురు తమ ఇబ్బందులను విన్నవించగా.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. పైగా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగడంతో ఉద్యోగులు, సిబ్బంది సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్ Cm Camp Office (2).jpg
సీఎం లాంటి వ్యక్తి సామాన్యుడిలా తమతో ఆప్యాయంగా గడపడం, తమ ఇబ్బందులను అడిగి మరీ తెలుసుకుని పరిష్కరించడం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమకు దక్కిన ఆత్మీయ గౌరవంగా భావిస్తున్నారు.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, నేతలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
క్యాంపు కార్యాలయంలో సీఎంను తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫోటో.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఫోటో.

భుజంపై చేయి వేసి ఆప్యాయంగా సీఎం కేసీఆర్
సోమవారం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ యాదవరెడ్డితోపాటు పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు.












Click it and Unblock the Notifications