Revanth Reddy: గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి రాధా కృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గవర్నర్‌ను రాధా కృష్ణన్ శాలువాతో సన్మానించారు. తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను రాష్ట్రపతి మహారాష్ట్రకు బదిలీ చేశారు. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి అసెంబ్లీ ప్రకటన చేసే అవకాశం ఉంది. మంగళవారం రెండో దశ రుణ మాఫీ చేయనున్నారు.

ఈ విషయాన్ని రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రూ.లక్షలోపు రుణ మాఫీ చేసిన సంగతి తెలిసింది. మూడు దఫాలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. హామీ అమలులో భాగంగా మూడు దఫాలుగా రుణ మాఫీ చేయనున్నారు.
ఈ ఏడాది మార్చి నుండి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సేవలందించి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన శ్రీ సీపి.రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@CPRGuv pic.twitter.com/m5GHhEnwvV
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2024












Click it and Unblock the Notifications