షాక్: హైదరాబాద్ లోనూ ‘చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’నోట్లు
ఒక వ్యక్తి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి కటకటాల పాలయ్యాడు.
హైదరాబాద్: చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ లోనూ దర్శనమిచ్చాయి. ఒక వ్యక్తి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్ షేక్ అనే స్టేషనరీ షాప్ యజమాని రూ.9.90 లక్షల విలువైన చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను డిపాజిట్ చేసేందుకు మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంక్ కు వచ్చాడు.

ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు క్యాషియర్ వెంటనే ఆ బ్రాంచి మేనేజర్ కు తెలిపాడు. మేనేజర్ కూడా వెంటనే కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దొంగ నోట్లలో రూ.2000 నోట్లు 400, రూ.500 నోట్లు 300 ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు నోట్లకు, చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏమాత్రం తేడా ఉండదని, వీటికి గుర్తించడం కూడా కష్టమేనని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్డారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications