ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిర్చికి గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్ యార్డుపై రైతుల దాడి, ఉద్రిక్తత

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మిర్చి ధర క్వింటాల్ కు రూ. 3 వేలకు పడిపోవడంతో రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మిర్చి ధర క్వింటాల్ కు రూ. 3 వేలకు పడిపోవడంతో రైతులు మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. మార్కెట్ కార్యాలయంపై రాళ్ళు రువ్వారు.

ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చికి క్వింటాల్ కు రూ.3 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యకం చేశారు. తూకం వేసే కాంటాలను ధ్వంసం చేశారు రైతులు.

మార్కెట్ బయటే ట్రేడర్లు తూకాలు నిర్వహించడంపై కూడ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆగ్రహాంతో రాళ్ళురువ్వారు. ఉదయం నుండి ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ కూడ పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

chilli farmers attacked on Khammam market yard

మార్కెట్ యార్డు పాలకవర్గం వ్యాపారులతో కుమ్మక్కైందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళన సమాచారాన్ని తెలుసుకొన్న పోలీసులు మార్కెట్ యార్డుకు చేరుకొని రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

అయితే రైతుల ఆందోళనకు టిడిపి నేతలు సంఘీభావం తెలిపారు.క్వింటాల్ మిర్చికి రూ.10 వేలకు పెంచాలని టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నేతలు ఈ ఆందోలనలో పాల్గొన్నారు.

English summary
chilli farmers attacked on Khammam market yard on Frideay. traders did not give for chillies alleged farmers, they continues protest from the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X