చినజీయర్ స్వామికి మాతృవియోగం: ఆశ్రమంలో అంత్యక్రియలు..
త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అలివేలు మంగ తాయారు (85) చనిపోయారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసు ఎక్కువ కావడంతో కోలుకోలేకపోయారు. గత రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. మాతృమూర్తి మరణంతో త్రిదండి చినజీయర్ స్వామి విషాదంలో మునిగిపోయారు.

Recommended Video
Antarvedi Temple Chariot CBI Probe హిందూధర్మ పరిరక్షణ కోసం పారదర్శకంగా ప్రభుత్వం...!! || Onendaa
హైదరాబాద్ శివారులో గల శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ ఆశ్రమం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మంగతాయారు అంటే చినజీయర్ స్వామి ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఆమె పరమపదించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంగ తాయారు మృతిపై పలువురు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications